మార్కాపురం: శ్రీశైలంలో మంత్రి రామానాయుడుతో కలిసి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు
మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి రాష్ట్రా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తో కలిసి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. స్వామి అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.