దర్శి: దొనకొండ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా రామకృష్ణ బాధ్యతలు స్వీకరణ
ప్రకాశం జిల్లా దొనకొండ పోలీస్ స్టేషన్లో నూతన ఎస్ఐగా రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి దొనకొండకు ఆయన బదిలీ అయ్యారు. గతంలో దొనకొండ ఎస్సైగా పనిచేసిన త్యాగరాజును ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. మండలంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని రామకృష్ణ తెలిపారు.