యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టు రెండో సోరంగంలో టన్నెల్ బోరింగ్ మిషన్ తొలగింపు ప్రారంభం
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద వెలుగొండ ప్రాజెక్టు రెండో సొరంగంలో టన్నెల్ బోరింగ్ మిషన్ తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వేగంగా పనులు జరుగుతున్నాయి. 11.8 కిలోమీటర్ల వద్ద ఉన్న ఈ యంత్రాన్ని విడిభాగాలుగా తొలగించి బయటకు తీసుకొస్తున్నారు. దీనిపై కోర్టులో స్టే ఉంది. ఇటీవల కోర్టు స్టే ఎత్తివేయడంతో పనులు మొదలెట్టారు. ఈ పనులు పూర్తయితే నల్లమల్ల సాగర్ కు కృష్ణా జలాలు ప్రవాహానికి మార్గం సుగమం కానుంది