మార్కాపురం: పొదిలి పట్టణంలో మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నారాయణరెడ్డి, పలువురి వృద్ధులకు కంటి పరీక్షలు
మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో మెగా కంటి వైద్య శిబిరం ఆదివారం జరిగింది. ఈ వైద్య శిబిరంలో పలువురు వృద్ధులు కంటి పరీక్షలు చేయించుకుని ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 150 మందికి పైగా వృద్ధులకు ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు గిద్దలూరు సమీపంలోని పెద్దకాకాని శంకర ఆసుపత్రి వారు తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే నారాయణరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వైద్యులను ఆసుపత్రి యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు.