రాయదుర్గం: హై రిస్క్ గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించిన బొమ్మనహాల్, ఎర్రగుంట పిహెచ్సి వైద్యాధికారులు
ప్రధానమంత్రి శ్వస్థ మాతృత్వ అభియాన్ (PMSMA) లో బాగంగా బొమ్మనహాల్ పిహెచ్సి పరిధిలో ఉద్దేహల్, ఉంతకల్లు, బండురు, కణేకల్లు పిహెచ్సి పరిధిలోని ఎర్రగుంట గ్రామాలలో హై రిస్క్ గర్భవతుల కు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యాధికారులు డాక్టర్ చల్లా శ్రీలక్ష్మి, డాక్టర్ మల్లీశ్వరి లు మాట్లాడుతూ ప్రతి గర్భవతి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలూ చేయించుకోవాలని పోషకాహారం, ఐరన్ మాత్రలు తీసుకోవాలని సూచించారు. మన ఇంట్లోనే దొరికే బెల్లం వేరుశనగకాయలు, గోంగూర, మునగాకు రాగులతో చేసినా ఆహార పదార్థాలు విరివిగా తీసుకోవాలని తెలిపారు. అత్యవసర సమయంలో 108 సేవలు వినియోగించుకోవాలని కోరారు.