గిద్దలూరు: గిద్దలూరులో సీఎం చంద్రబాబు పర్యటన, అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలను మళ్లించిన అధికారులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు లో సీఎం చంద్రబాబు ఈనెల 27వ తేదీ శనివారం పర్యటిస్తున్న నేపథ్యంలో అధికారులు గిద్దలూరు పట్టణంలోకి ఉదయం ఏడు నుంచి రాత్రి 7 గంటల వరకు వారి వాహనాలకు అనుమతి లేదని వెల్లడించారు. గిద్దలూరు మీదుగా, నంద్యాల, మార్కాపురం ప్రాంతాలకు ప్రయాణించే వాహనదారులు తాటిచెర్ల మోట జంక్షన్ నుంచి పోరుమామిళ్ల, మైదుకూరు, ఆర్లగడ్డ ప్రాంతాల నుంచి ప్రయాణించాలన్నారు. ఒంగోలు కర్నూలు మధ్యప్రయాణించే వాహనదారులు కూడా ఇదే రాస్తాను వినియోగించాలన్నారు. ట్రాఫిక్ ర దీని దృష్టిలో ఉంచుకొని గిద్దలూరు పట్టణంలోకి వాహనాలను అనుమతి ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు.