దర్శి: తాళ్లూరు ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు.