గిద్దలూరు: గిద్దలూరులో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు పురస్కరించుకొని పూలమాల వ్యక్తి నివాళులు అర్పించిన బీసీ నాయకులు
మార్కాపురం జిల్లా గిద్దలూరులో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీసీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహానేతగా జ్యోతిరావు పూలే చిరస్మరణీయుడని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాడి శ్వేత తెలిపారు. పలువురు బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పూలే సేవలను స్మరించుకున్నారు.