గిద్దలూరు: కంభం చెరువు నుంచి పంటలు వేసుకునేందుకు నీరు విడుదల చేయాలని నీటి పారుదల శాఖ కార్యాలయం ముందు నిరసన తెలిపిన రైతులు
అధికారులు సకాలంలో నీళ్లు విడుదల చేయకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని మార్కాపురం జిల్లా కంభం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంభం చెరువు ఆయకట్టుపై ఆధారపడి పంటలు వేస్తున్న పోరుమామిళ్లపల్లి, జేబీకేపురం, కంభం, దర్గా, పెద్ద నల్ల కాలువ, సోమవారిపేట రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కంభంలోని నీటిపారుదల శాఖ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించి తక్షణమే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ప్రతి సీజన్లో అడగకముందే పది అడుగులకు పైగా కంభం చెరువులో నీరు ఉంటే అధికారులు నీరు విడిచి పెట్టే వాళ్ళన