విశాఖపట్నం: స్థానిక ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి: పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు, జనగణన మరియు రిజర్వేషన్ల ప్రక్రియపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, వార్డుల విభజనలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.