గిద్దలూరు: గిద్దలూరు టిడిపి కార్యాలయంలో 60 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు టిడిపి కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి.. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందినందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న 60 మందికి రూ.35.53 లక్షలు విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 1100 మందికి పైగా రూ.9 కోట్లకు పైగా విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.