కొండపి: సింగరాయకొండ లోని మల్లికార్జున నగర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఎస్టీ కమిషన్ చైర్మన్ భోజిరెడ్డి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మల్లికార్జున్ నగర్ ప్రాథమిక పాఠశాలను ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జి రెడ్డి పరిశీలించారు.పాఠశాల పరిసరాలను వీక్షించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఆధార్ కార్డులు లాంటి సమస్యలు ఉన్నాయని సంబంధిత అధికారులకు తెలిపి త్వరగతిన పూర్తి చేస్తామని చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలిసి పాటలు పాడి చిన్నారులను అలరించారు. ఈ సందర్భంలో ఎస్టి కమిషన్ సభ్యులు కూటమి నాయకులు పాల్గొన్నారు.