మార్కాపురం: ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు పంపిణీ చేసినట్లు తెలిపిన ఎంఈఓ రాందాస్ నాయక్
మార్కాపురం మండల పరిధిలో 86 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని ఎంఈఓ రాందాస్ నాయక్ తెలిపారు. అన్ని తరగతులకు సంబంధించి 54,867 టెస్ట్ బుక్స్, వర్క్ బుక్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్రా స్టూడెంట్ కిట్లు మూడు రోజుల క్రితమే పంపిణీ చేసినట్లు తెలిపారు. బెల్ట్ లు 6459, యూనిఫామ్స్ 10,479, నోట్ బుక్స్, 67048, 6 తరగతి డిక్షనరీ 1144 అందజేశామని పేర్కొన్నారు.