గిద్దలూరు: రాచర్ల మండలంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి నిబంధనలను వెల్లడించిన సూపర్వైజర్ లక్ష్మీరెడ్డి
మార్కాపురం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో మంగళవారం ఉపాధి హామీ పనులను సూపర్వైజర్ లక్ష్మిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేసి ఉపాధి కూలీలకు జాగ్రత్తలు చెప్పారు. కేటాయించిన పరిధి మేరకు నిబంధన ప్రకారం వేగంగా పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు సకాలంలో త్వరగా పనులు ముగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని లక్ష్మీ రెడ్డి ఉపాధి కూలీలకు తెలిపారు. అలానే హాజరు వేసే అంశంలో అవకతవకలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తగునిబంధనలు మార్చేందని తెలిపారు.