కొండపి: సింగరాయకొండ లోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, ఘనంగా జరిగిన గజోత్సవం, భారీగా తరలివచ్చిన భక్తులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం గజోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రంగురంగుల పతాకాలు, పూల తోరణాలతో ఆలయ ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. మల్లెలు, రంగురంగుల గులాబీలతో అలంకరించిన గజవాహనాన్ని భక్తులు భుజాలపై మోస్తూ ఊరేగించారు. ఆలయ వీధులన్న గోవింద నామస్మరణతో మార్మోగాయి. ఈ వైభవాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.