కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం కు చెందిన రియల్టర్ ఎర్రి స్వామి పై చీటింగ్ కేసు నమోదు
కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన రియల్టర్ ఎర్రి స్వామి పై పోలీసులు సోమవారం చీటింగ్ కేసు నమోదు చేశారు. ఎర్రి స్వామి నకిలీ బ్యాంకు పత్రాలతో ప్రజలను బురిడీ కొట్టించాడు. సుమారు మూడు కోట్ల దాకా మోసం చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో సీఐ హరినాథ్ లోతుగా విచారణ చేపట్టారు. విచారణలో ఎర్రి స్వామి మోసానికి పాల్పడినట్లు తేలడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.