గిద్దలూరు: కొమరోలు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో రేషన్ దుకాణదారుడు అక్రమాలకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు ఆరోపణ
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో రేషన్ దుకాణంలో రేషన్ దందాపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఓ వీడియోని విడుదల చేసిన గ్రామస్తులు, ప్రభుత్వ రేషన్ దుకాణదారుడు చక్కెర, బియ్యం ప్రజలకు ఇవ్వకుండా తక్కువ ధరకు కొనుగోలు చేసుకుని బహిరంగం మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకుంటున్నట్లు ప్రజలు ఆరోపించారు. అవకతవకలకు పాల్పడుతున్న రేషన్ దుకాణదారుడు పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు