గిద్దలూరు: బేస్తవారిపేట మండలం చింతలపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై అదుపుతప్పి కారు బోల్తా, ఒకరు మృతి
మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం చింతలపాలెం గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తి సంఘటనా స్థలంలోని ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు బేస్తవారిపేటకు చెందిన చోళవీటి రసూల్ గా పోలీసులు గుర్తించారు. రసూల్ కారును మరమ్మత్తుల కోసం గుంటూరు తీసుకువెళ్లి బేస్తవారిపేటకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. జరిగిన ప్రమాదంపై స్థానిక పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.