గిద్దలూరు: గిద్దలూరులో బిజెపి మీడియా సమావేశం, ప్రధాని పాలనపై మాట్లాడిన ఏపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి రామచంద్రారెడ్డి
దేశ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో వికసిత్ భారత్ వైపు నడుస్తుందని ఏపీ రాష్ట్ర బిజెపి మీడియా ప్రతినిధి ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో బిజెపి నాయకులు పట్టణ అధ్యక్షుడు అప్పిశెట్టి ఉదయ శంకర్, మార్కాపురం జిల్లా జనరల్ సెక్రటరీ జై.వీ నారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో రాష్ట్ర బిజెపి మీడియా ప్రతినిధి ఏలూరి రామచంద్ర రెడ్డి మాట్లాడారు. 1975 జూన్ 25 అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చీకటి పాలన నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ వైపు నడిపించారని కొనియాడారు.