గిద్దలూరు: గిద్దలూరు మండలంలో దొంగతనాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అర్బన్ సీఐ సురేష్
దొంగతనాలు జరగకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని మార్కాపురం జిల్లా గిద్దలూరు అర్బన్ సురేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం మీడియాకు సీఐ సురేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరుబయట నిద్రించేవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒంటిపైన విలువైన వస్తువులు ధరించి బయట నిద్రించరాదని అన్నారు. మీ విలువైన వస్తువులను ఇంట్లో భద్రపరుచుకోవాలన్నారు. అలానే ఆలయాలలో చోరీలు జరగకుండా ఆలయ కమిటీ సభ్యులు జాగ్రత్తలు పాటిస్తూ ఆలయాలలో రోజు రాత్రి ఒకరు నిద్రించేలా చూసుకోవాలన్నారు.