కొండపి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బహిరంగంగా మద్యం తాగుతున్న ప్రాంతాలను గుర్తించి శుభ్రం చేసిన పోలీసులు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శనివారం పోలీసులు బహిరంగంగా మద్యం తాగుతున్న ప్రాంతాలపై నిగా పెట్టారు. అందులో భాగంగా బహిరంగంగా మద్యం తాగుతున్న ప్రాంతాలను గుర్తించి పోలీసు సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. పట్టుబడిన వారికి జరిమానా విధించడంతోపాటు వార్నింగ్ ఇచ్చారు. ఎస్పీ ఆదేశాలతో నిరంతరం బహిరంగంగా మద్యం తాగుతున్న ప్రాంతాలపై నిఘా ఉంచడమే కాకుండా బహిరంగంగా మద్యం తాగితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.