కనిగిరి: పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. రక్తదానం చేయడం ద్వారా అత్యవసర సమయాల్లో ఆపదలో ఉన్న సాటి మనిషికి ప్రాణదానం చేసి కాపాడుకోవచ్చు అన్నారు. యువత రక్తదానం చేసేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం శుభ పరిణామం అన్నారు. యువత రక్తదానంపై ఉన్న అపోహలను విడనాడి, రక్తదానం చేయాలన్నారు.