కనిగిరి: కనిగిరి పట్టణంలోని పలు వార్డులలో పిచ్చి మొక్కలను తొలగించిన మున్సిపల్ అధికారులు, హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
కనిగిరి పట్టణంలోని పలు వార్డులలో శనివారం పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. స్థానికంగా పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఈగలు దోమలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన జెసిబి సహాయంతో మున్సిపల్ అధికారులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి పిచ్చి మొక్కలు తొలగించారు. దీంతో స్థానిక ప్రజలు మున్సిపల్ చైర్మన్ పై అధికారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.