కనిగిరి: ఈనెల 30వ తేదీన ఒంగోలులో జరిగే వైసిపి సమావేశానికి కార్యకర్తలు హాజరుకావాలని విజ్ఞప్తి చేసిన కనిగిరి వైసీపీ ఇన్ ఛార్జ్
ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ ఇన్ ఛార్జ్ దద్దనాల నారాయణ యాదవ్ ఈనెల 30వ తేదీన ఒంగోలు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో జరిగే కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని శనివారం నియోజకవర్గంలోని వైసిపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రీ కాల్ బాబు పేరుతో చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అలానే గత ప్రభుత్వం హయాంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల మేనిఫెస్టో పై చర్చ ఉంటుందని అంతేకాకుండా ప్రజలకు గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం అగ్ర వైసిపి నాయకులు నిర్వహిస్తున్నట్లు నారాయణ యాదవ్ తెలిపారు.