కనిగిరి: మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వారాహి నవరాత్రుల్లో భాగంగా వర్షాలు కురవాలని చండీ హోమం నిర్వహణ
ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం చండీ హోమాన్ని నిర్వహించారు. వారాహి నవరాత్రులలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మరియు కనిగిరి ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు రైతన్నలు ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చండీ హోమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆలే కమిటీ సభ్యులు వెల్లడించారు. తెల్లవారుజాము నుంచి ఆలయంలో చండీ హోమం నిర్వహించడంతోపాటు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు.