కనిగిరి: నడికుడి కాళహస్తికి జరుగుతున్న రైల్వే లైన్ పనులను పామూరు వద్ద పరిశీలించిన కనిగిరి బిజెపి ఇన్ ఛార్జ్ వెంకటరమణయ్య
ప్రకాశం జిల్లా పామూరు మండలంలో జరుగుతున్న నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులను కలిగిరి బిజెపి ఇన్ ఛార్జ్ వెంకట రమణయ్య ఆదివారం పరిశీలించారు. చిరకాలంగా మిగిలిపోయిన స్వప్నాన్ని త్వరగా పూర్తిచేసే విధంగా చూడాలని సంబంధిత అధికారులను కలిసి విజ్ఞప్తి చేస్తామని వెంకట రమణయ్య అన్నారు. పామూరు పరిసర ప్రాంతాలలో రైల్వే ట్రాక్ పనులు వేగవంతంగా పూర్తయ్యే విధంగా చూడాలని స్థానిక శాసనసభ్యులు కలిసి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక మండలాల బిజెపి నాయకులు పాల్గొన్నారు.