ఉరవకొండ: గ్రామాల్లోని ఈద్గాల వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని మండలాలైన ఉరవకొండ బెలుగుప్ప కూడేరు వజ్రకరూర్, విడపనకల్లు మండలాల పరిధిలోని గ్రామాల్లో ఉన్న ఈద్గాల వద్ద రంజాన్ పండుగను పురస్కరించుకుని శనివారం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వజ్రకరూరు మండల కేంద్రంలో గాంధీ సర్కిల్ నందు రంజాన్ పండుగ సందర్భంగా మాల మహానాడు అధ్యక్షుడు బాల రామాంజనేయులు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు కూల్ డ్రింక్స్ను వజ్రకరూర్ సర్పంచ్ మోనాలిసా,ఏఎస్ఐ రమేష్లతో పాల్గొని ముస్లిం సోదరులకు కూల్ డ్రింక్స్ పంపిణీ చేసారు.