యర్రగొండపాలెం: బొమ్మలాపురం గ్రామంలో వాగు గట్టుపై నడుస్తూ ప్రమాదవశాత్తు కాలుజారి వాగులో పడి మృతి చెందిన రవి
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని వాగు గట్టుపై నడుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారిపడి ఉప్పుతోళ్ల రవి అనే వ్యక్తి వాగులో పడిపోయి మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు ఘటన స్థలానికి చేరుకొని వాగులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. రవి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.