కొండపి: వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే 4జిల్లాల ప్రజలకు త్రాగునీరు సాగునీరుకు ఇబ్బంది ఉండదు:ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన మంత్రి స్వామి.. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 11.25 లక్షల మందికి తాగునీరు అందుతుందని మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. అతి త్వరలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 2029 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం గెలుస్తుందని మంత్రి స్వామి జోస్యం చెప్పారు.