రాయదుర్గం: సిబ్బందిని పెంచాలంటూ కణేకల్లులో యూనియన్ బ్యాంక్ కు తాళం వేసి ధర్నా నిర్వహించిన రైతులు
కణేకల్ లోని యూనియన్ బ్యాంక్‌లో సిబ్బందిని పెంచి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం మండల అధ్యక్షుడు జయచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బ్యాంకుకు తాళం వేసి ధర్నా నిర్వహించారు. సిబ్బంది కొరత వల్ల రైతులు క్రాప్ లోన్ రెన్యూవల్ లో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని బ్యాంక్ మేనేజర్ వారికి హామీ ఇవ్వడంతో ధర్నాను తాత్కాలికంగా విరమించారు.