రాయదుర్గం: జర్నలిస్టులపై హత్యాకాండ ను నిరసిస్తూ కణేకల్లులో దర్నా
జర్నలిస్టులపై దాడులు హత్యాకాండ నిరసిస్తూ కణేకల్లు లో విలేకరులు ధర్నా నిర్వహించారు. గురువారం కణేకల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ బ్రహ్మయ్య కు వినతిపత్రం అందజేశారు. ఇటీవల తిరుపతిలో జర్నలిస్టు జగన్ ను అతి కిరాతకంగా హత్య చేశారని, హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. యూనియన్ నాయకులు వజీఫా సీనియర్ విలేకరులలు పాల్గొన్నారు.