మార్కాపురం: పొదిలి నుండి దర్శికి వెళ్తున్న రహదారిలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా డ్రైవర్ కు ట్రక్కులో ఉన్నా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
మార్కాపురం జిల్లా పొదిలి నుండి దర్శి ప్రధాన రహదారిలో మల్లవరం పవర్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొదిలి నుంచి దర్శి వైపు వస్తున్న ట్రాక్టర్ ను వెనక వస్తున్న ట్రాక్టర్ ఓవర్ టెక్ చేసింది. అది తగులుతుందన్న భయంతో ఒకవైపు ఉన్న గట్టు ఎక్కి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్ ట్రక్కులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.