గిద్దలూరు: గిద్దలూరు టిడిపి కార్యాలయంలో సబ్సీడీ రుణాల చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
సబ్సీడీ రుణాల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి డీఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని 31 మంది ఎస్సీ మహిళా లబ్ధిదారులకు పి.ఎం. అజయ్ పథకం కింద రూ.34.50 లక్షల సబ్సిడీ రుణాల చెక్కులను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అందజేశారు. గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు.