రాయదుర్గం: వేలాది మంది భక్త జన సందోహం మద్య ప్రసన్న వెంకటరమణ స్వామి రథోత్సవం
రాయదుర్గంలో వేలాది మంది భక్త జన సందోహం మద్య శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. గురువారం ఉదయం మడుగుతేరు జరగగా సాయంత్రం వినాయక కూడలి నుంచి బళ్ళారి రోడ్డు మీదుగా మార్కండేయ స్వామి ఆలయం వరకూ రథోత్సవం సాగింది. గోవింద నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. ఆంద్ర కర్నాటక ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి రథోత్సవ వేడుకలో పాల్గొన్నారు. పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.