మార్కాపురం: సుందరయ్య కాలనీలో నీళ్ల కోసం ఏర్పాటు చేసిన ట్యాంకర్లు అధ్వానంగా ఉన్నాయని తెలిపిన కాలనీవాసులు
మార్కాపురం సుందరయ్య కాలనీలో నీళ్ల కోసం ఏర్పాటుచేసిన ట్యాంకర్లు పాచిపట్టి అద్వానంగా ఉన్నాయి. పట్టించుకున్న నాధుడే లేడని కాలనీవాసులు వాపోయారు. సరైన నీటి ట్యాంకర్ లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తాత్కాలికంగా అక్కడక్కడ నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేశారు కానీ వాటిని మున్సిపల్ సిబ్బంది కన్నెత్తి కూడా చూడలేదన్నారు. దీంతో పరిశుభ్రత లోపించి ఇబ్బందులు పడుతున్నమన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు.