దర్శి: కురిచేడు మండలం నూతన ఎస్ఐగా కోటయ్య బాధ్యతల స్వీకరణ
Darsi, Prakasam | Jun 11, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు మండల నూతన ఎస్ఐగా కోటయ్య గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన శివ విఆర్ కు బదిలీ అయ్యారు. ఆ స్థానంలో పెద్ద చెర్లోపల్లి ఎస్సైగా పనిచేస్తున్న కోటయ్యను కురిచేడుకు బదిలీ చేస్తూ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నూతన బాధ్యతలు స్వీకరించిన కోటయ్య మాట్లాడుతూ... శాంతి భద్రతల పై ప్రత్యేక దృష్టి పెడతానని మండలంలోని ప్రజలు సహకరించాలని కోరారు