గిద్దలూరు: గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామంలో పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 11 మందిని స్థానిక పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.80,800 నగదు స్వాధీనం చేసుకున్నామని అర్బన్ సీఐ సురేష్ మీడియాకు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని సీఐ సురేష్ హెచ్చరిస్తున్నారు.