మార్కాపురం: వర్చువల్ మహానాడు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జి రామిరెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని టిడిపి కార్యాలయం నందు నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జి కందుల రామిరెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకులకు కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 27 28వ తేదీల్లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీకి కార్యకర్తలే బలం వారి కృషి వల్లనే పార్టీ పురోభివృద్ధి చెందుతుందన్నారు.