గిద్దలూరు: ఏపీ సీఎం గిద్దలూరులో పర్యటన సందర్భంగా 900 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడి
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 27వ తేదీన గిద్దలూరు మండలంలో పర్యటిస్తున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేకంగా పరిశీలించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా 900 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎస్పీ ఎవరికీ కేటాయించిన విధులను వారు సమర్థవంతంగా నిర్వహించి సీఎం పర్యటన విజయవంతం చేయాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు.