కొండపి: మర్రిపూడి మండలం గుండ్ల సముద్రం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా పర్యటించిన కలెక్టర్ రాజాబాబు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గుండ్ల సముద్రం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం మరియు శుక్రవారం కలెక్టర్ రాజబాబు గ్రామంలో పర్యటించారు. శుక్రవారం రాత్రి గ్రామంలోని నిద్రించిన కలెక్టర్ శనివారం గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలానే పలు కార్యాలయాలు సందర్శించి రికార్డులు పరిశీలించి గ్రామంలోని అభివృద్ధి పనులను పరిశీలించారు. వచ్చిన సమస్యలన్నిటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని కలెక్టర్ తెలిపారు.