తాడిపత్రి: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో హంద్రీనీవా ను నిర్వీర్యం చేశారు: యాడికి లో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు
గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో హంద్రీనీవా ను నిర్వీర్యం చేశారని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఆరోపించారు. సోమవారం యాడికి లో సీఎం చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో ఆయన ఆదివారం యాడికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన సాయంత్రం ఐదు గంటల సమయంలో మీడియాతో మాట్లాడారు. హంద్రీనీవా ను వైసీపీ పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు సరిహద్దులో ఉన్న కుప్పం, కర్ణాటక సరిహద్దులో ఉన్న మడకశిర కు నీళ్లు ఇచ్చారన్నారు. సాగు, తాగునీటికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.