యర్రగొండపాలెం: పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలకు నిరసనగా వైపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే వినూత్నంగా ఎడ్ల బండి పై ఎమ్మార్వో కార్యాలయం వరకు చేరుకుని నిరసన తెలిపారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలపై భారం మోపిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిత్యవసర సరుకుల ధరలు పెరిగిపోయి ప్రజల అల్లాడుతున్న సమయంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఆర్థిక స్థితిగతులపై పెను భారం మోపారని విమర్శించారు.