మార్కాపురం: గిట్టుబాటు ధర కల్పించాలని పొదిలిలో పొగాకు రైతులు రాస్తారోకో
మార్కాపురం జిల్లా పొదిలి పొగాకు బోర్డు వేలంకేంద్రంలో గిట్టుబాటు ధర లభించడం లేదని ఆగ్రహించిన రైతులు వేలాన్ని నిలిపివేశారు. ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 400కు పైగా పొగాకు బేళ్లు తీసుకురాగా కేవలం 20 బేళ్ళని కొనుగోలు చేశారని రైతుల ఆరోపించారు. సమాచారం అందుకున్న సిఐ రాజేష్ కుమార్ పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింప చేశారు.