యర్రగొండపాలెం: దోర్నాల ప్రభుత్వ పాఠశాలలో మంచి ప్రతిభను చాటిన 10వ తరగతి విద్యార్థులు
మార్కాపురం జిల్లా దోర్నాల ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివిన విద్యార్థులు ప్రతిభా చాటారు. గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాలలో రామిశెట్టి శిరీష 574 మార్కులతో మొదటి స్థానంలో సోహెబ్ 565 మార్కులతో రెండవ స్థానం కోమలి 559 మార్కుల తో మూడో స్థానం సాధించారు. పాఠశాలలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.