రాయదుర్గం: హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన ఆంజనేయస్వామి ఆలయాలు
హనుమాన్ జయంతి సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మంగళవారం ఉదయమే పట్టణంలోని బళ్ళారి రోడ్డులో ఉన్న ఉక్కడం ఆంజనేయస్వామి దేవాలయంలో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాంతి హోమం నిర్వహించారు. విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీరామ నామంతో ఆలయాలు మారుమోగాయి. భజన బృందం సభ్యులు ఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి.