యర్రగొండపాలెం: గురిజేపల్లి లో కిశోర వికాసం వేసవి శిక్షణ తరగతుల నిర్వహించిన సిడిపిఓ హేమలత
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లి గ్రామంలో కిశోర వికాసం వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఐసిడిఎస్ సిడిపిఓ హేమలత పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ... కిశోర బాలికలు తీసుకోవలసిన పోషకాహారం గురించి అవగాహన కల్పించారు. రక్తహీనత నివారణకు ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. శరీరానికి వ్యాయామం అవసరమని సమతుల ఆహారం తీసుకోవాలని సూచించారు