యర్రగొండపాలెం: తమిళనాడు సిఎం జోసఫ్ విజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గుర్రపుశాల గ్రామస్తులు
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం గుర్రపుశాల గ్రామంలో తమిళనాడు టీవీకే అధినేత జోసఫ్ విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా విజయ్ చిత్రపటానికి ఎస్సీ పాలెం గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. అనంతరం సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గ్రామంలో బాణాసంచా పేల్చడం తో పాటు స్వీట్లు పంపిణీ భోజనాలు ఏర్పాట్లు చేశారు.