రాయదుర్గం: పట్టణంలో జటిలమవుతోన్న తాగునీటి సమస్య, మొలకల్మూరు రోడ్డులో ఖాళీ బిందెలతో దర్నా
రాయదుర్గంలో రోజురోజుకూ తాగునీటి సమస్య జటిలమవుతోంది. పైప్ లైన్ లీకేజిలు, విద్యుత్ అంతరాయంతో పంపింగ్ సక్రమంగా జరగడంలేదు. వారం, పది రోజులైనా కొన్ని ప్రాంతాలకు నీరు విడుదల చేయలేదు. ముఖ్యంగా మొలకల్మూరు రోడ్డు, కోతిగుట్ట, బైపాస్ రోడ్డు, మధు టాకీస్ ఏరియా, ఆత్మకూరు వీధి నేసేపేట తదితర ప్రాంతాల్లో నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా సోమవారం మొలకల్మూరు రోడ్డులో స్థానికులు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి ధర్నా చేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది.