గిద్దలూరు: కొమరోలు ఎస్సీ హాస్టల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా కొమరోలు పట్టణంలోని ఎస్సీ హాస్టల్ ని మంగళవారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేయడంతో పాటు ఆహారం నాణ్యతను ఎమ్మెల్యే పరిశీలించారు. తర్వాత విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు నివసిస్తున్న ప్రాంతాలు పరిశీలించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.