దర్శి: ఈజీ మనీ వుచ్చులో పడి మోసపోవద్దని ప్రజలకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
ఈజీ మనీ అధిక లాభాలు ఇంటి నుంచే సులభంగా సంపాదన వంటి ప్రకటనలను నమ్మి మోసపోవద్దని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేసే యాప్లు వెబ్సైట్లు సోషల్ మీడియా లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ సంస్థలోనైనా పెట్టుబడి పెట్టే ముందు దాని విశ్వసనీయత నిర్ధారించుకోవాలని అనుమానస్పద ఆఫర్లు ఎదురైతే వెంటనే పోలీసులకు లేదా సైబర్ హెల్ప్ లైన్లకు ఫిర్యాదు చేయాలన్నారు.